Sukumar-DSP

Sukumar-DSP: 22 ఏళ్ల కంబోకి పులుస్టాప్.. డీఎస్పీ ని మార్చిన సుకుమార్..?

Sukumar-DSP: సుకుమార్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరూ చెప్పే పేరు దేవి శ్రీ ప్రసాద్.. సుకుమార్ చేసిన ఆర్య నుండి పుష్ప-2 సినిమా వరకు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతి పాట అలాగే ఐటెం సాంగ్స్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇప్పుడు సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ ప్లేస్ లో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలని చూస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.. గతంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఇలా జరిగే అవకాశం ఉంది.

పుష్ప-2 సమయంలో సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సమస్య మొదలైంది. సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వకపోవడం.. ముఖ్యంగా రీ-రికార్డింగ్ సమయంలో దేవీశ్రీ ప్రసాద్ ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలగడంతో డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఇంకొకరి దగ్గరికి వెళ్లిన విషయం కూడా తెలిసిందే. శ్యామ్ సి.ఎస్ చివరి నిమిషంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం జరిగింది.

రామ్ చరణ్ ఇంకా సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో సినిమా మొదలు కాకముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అది కాక గతంలో రాజమౌళి ఈ సినిమా టైటిల్ కార్డు గురించి చెప్పి సినిమాపైన ఆసక్తిని పెంచేశారు. ఇంకో పక్కన దేవి శ్రీ ప్రసాద్ తాను హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలో బిజీగా ఉన్నారు. తాను హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

22 ఇయర్స్ నుండి కలిసి ఉన్న ఈ ఇద్దరు చిన్న చిన్న మనస్పర్థలకు లొంగిపోయే రకం కాదని, వాళ్లు కలిసే సినిమా తీస్తారని ఇంకొన్ని వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏది ఏమైనా పెద్ద సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్, సినిమా రిలీజ్ తర్వాత కొంత రెస్ట్ తీసుకొని సుకుమార్ సినిమాలో జాయిన్ అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *