Gold Price Today

Gold Price Today: భారీగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు తులం బంగారం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా మారుతున్న పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మే 28న హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లో ముడి చమురు, బంగారం ధరలు పోటీ పడుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంలోనే బంగారం ధర దాదాపు 70 శాతం పెరగ్గా, వెండి ధర రికార్డు స్థాయిలో 150 శాతం వరకు పెరిగింది. అయితే బుధవారం ధరలు భారీగా తగ్గగా, గురువారం మార్కెట్లో ధరలు స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు:
ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.1,45,090 వద్ద కొనసాగుతోంది. అలాగే అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,58,280 పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,18,710 వద్ద ఉంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు అమరావతి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ఖమ్మం, నిజామాబాద్ వంటి అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి. గ్రాముల పరంగా చూస్తే.. 22 క్యారెట్ల బంగారం గ్రాము రూ.14,509 గా, 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,828 గా ఉంది.

స్వల్పంగా తగ్గిన వెండి ధరలు:
బంగారంతో పోలిస్తే వెండి ధర నేడు కొద్దిగా తగ్గింది. నిన్నటితో పోల్చితే కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం దేశీయంగా వెండి గ్రాము ధర రూ.284.90 కాగా, కిలో ధర రూ.2,84,900 వద్ద కొనసాగుతోంది. అయితే ప్రాంతీయ పన్నుల మార్పుల వల్ల హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద విక్రయమవుతోంది. ఇతర నగరాలైన చెన్నైలో రూ.2,89,900, బెంగళూరులో రూ.2,85,100, కోల్‌కతాలో రూ.2,84,900 గా నమోదైంది.

సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ప్రపంచ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకపు విలువ ఆధారంగా మనదేశంలో బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఇక్కడా పెరుగుతాయి, అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి. నగల ప్రియులు ఎక్కువగా 22 క్యారెట్ల ధరలనే ప్రామాణికంగా తీసుకుని కొనుగోళ్లు చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *