Naga Chaitanya: సాయిదుర్గాతేజ్ హీరోగా బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ‘విరూపాక్ష’ మూవీతో చక్కని విజయాన్ని సొంతం చేసుకున్నాడు దర్శకుడు కార్తీక్ దండు. దాంతో అదే సంస్థలో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇప్పుడీ సినిమాలో హీరోగా నాగచైతన్యను ఎంపిక చేశారు. నవంబర్ 23న చైతు పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్ డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెడుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ‘విరూపాక్ష’ సినిమాతో సాయి దుర్గా తేజ్ వంద కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. అలానే ఇప్పుడు నాగచైతన్యకూ కార్తీక్ దండు గ్రాండ్ సక్సెస్ ను అందించే ఆస్కారం లేకపోలేదు.

