Viral News: కొన్నిరోజులు అయితే అందరూ ఈమెనే స్ఫూర్తిగా తీసుకుంటారేమో ఎందుకంటే పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసన చేస్తున్న వివాహిత అశ్విని.
బాధితురాలు అశ్విని కథనం ప్రకారం.. ఆమెకి 2006లో (అనంతపురానికి చెందిన అశ్వినికి) పెనుకొండకు చెందిన చిదంబర్‌నాథ్‌తో వివాహం జరిగింది. వీరికి 2008లో కుమారుడు దినకర్‌స్కంద జన్మించాడు. కుమారుడు జన్మించిన తర్వాత నుండి అదనపు కట్నం కోసం వేధింపులు చేయడం మొదలుపెట్టారు. ఇంకో పక్కన వివాహిత మామ లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. కుమారుడి భవిష్యత్తు కోసం ఎంత కష్టం వచ్చినా తట్టుకొని నిలబడదాం అనుకున్నాను. కానీ భరిస్తున్నాను కదా అని ఇంకా అతి చేయడం మొదలు పెట్టారు. దీంతో 2021లో కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయాను. నేను వెళ్లిపోయిన కొన్నిరోజులకే భర్త నుండి విడాకుల నోటీసులు వచ్చాయి. కోర్టులో విводаహ విడాకుల కేసు డిస్మిస్ చేశారు. ఈమె 2026 మార్చిలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాధితురాలి కుమారుడు దినకర్‌స్కంద ఇంటర్ పూర్తిచేశాడు. బిటెక్ చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆమె దగ్గర బిటెక్ చదివించడానికి కావలసిన డబ్బులు లేకపోవడంతో కొడుకు చదువు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి సమయంలో తమ కుటుంబం నుండి తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని అత్తింటివారిని అడుగుతున్నా స్పందించడం లేదని, తనని కనీసం ఇంట్లోకి కూడా పిలవడం లేదని, దీంతో ఇంటిముందే కొడుకుతో బైఠాయించి నిరాహార దీక్ష చేస్తున్నామన్నారు.
