Gold Price Today: గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపించిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. పసిడి ప్రేమికులకు ఊరటనిస్తూ శనివారం ఉదయం మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉదయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 300 నుండి రూ. 440 వరకు తగ్గడం విశేషం.
నిజానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పాటు, మన దేశంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచడం వల్ల గత కొన్ని రోజులుగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే, ఇటీవల బంగారం కొనుగోళ్లు కాస్త తగ్గించాలని ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత మార్కెట్లో లాభాల స్వీకరణ జరుగుతోంది. కొనుగోళ్లు మందగించడంతో మార్కెట్లో ఒత్తిడి తగ్గి, ఈరోజు ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
తాజా హెచ్చుతగ్గుల తర్వాత దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,480 కి చేరింది. నిన్న ఉదయం ఇదే బంగారం ధర రూ. 1,59,940 గా ఉండేది. అలాగే, సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,46,190 కి తగ్గింది. నిన్న దీని ధర రూ. 1,46,610 గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. నిన్న కేజీ వెండి ధర రూ. 2,85,100 ఉండగా, ఈరోజు అది రూ. 2,84,900 కి దిగివచ్చింది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈరోజు ధరల వివరాలు చూస్తే.. మన హైదరాబాద్, విజయవాడలతో పాటు ముంబై, బెంగళూరు, కోల్‌కతా మరియు కేరళ రాష్ట్రంలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,59,480 వద్ద, అలాగే 22 క్యారెట్ల ధర రూ. 1,46,190 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,59,630 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,46,240 గా ఉంది. ఇక దేశంలోనే అత్యధికంగా చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61,230 కి, 22 క్యారెట్ల ధర రూ. 1,47,790 కి ట్రేడవుతోంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే, ప్రాంతాన్ని బట్టి రేట్లలో కొంత తేడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, బెంగళూరు నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2,84,900 గా ఉంటే.. మన హైదరాబాద్‌తో పాటు చెన్నై, కేరళ ప్రాంతాల్లో మాత్రం కేజీ వెండి ధర రూ. 2,95,100 వద్ద కొనసాగుతోంది. ధరలు భారీగా కాకపోయినా కొద్దిగానైనా తగ్గడం పట్ల మధ్యతరగతి ప్రజలు, పెళ్లిళ్ల సీజన్ కొనుగోలుదారులు కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్నారు.
