Peddi Run Time: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రం గురించి ఒక సంచలన ఇన్‌సైడ్ టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్లు సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌నకు బరువైన ఎమోషన్స్ జోడించి, పక్కా కమర్షియల్ మీటర్‌లో బుచ్చిబాబు ఈ ఊర మాస్ బొమ్మను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
భారీ రన్ టైమ్.. క్లైమాక్స్ హైలైట్!
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమా ఎడిటింగ్ వర్క్ పూర్తయి, ఫైనల్ రన్ టైమ్ 3 గంటల 2 నిమిషాల లాక్ అయినట్లు టాక్. ఈ రోజుల్లో మూడు గంటల నిడివి అంటే కాస్త రిస్కే అయినప్పటికీ, కథలోని బలమైన ఎమోషన్స్ వల్ల ఆడియెన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టదని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది.
ముఖ్యంగా సినిమాకు చివరి 50 నిమిషాలు ప్రాణంగా నిలవనున్నాయట. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఒక పవర్‌ఫుల్ ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లడం పక్కా అని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
రామ్ చరణ్ వన్ మ్యాన్ షో.. రగ్గడ్ అవతార్!
సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ రామ్ చరణ్ యాక్టింగేనని సమాచారం. మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన, రగ్గడ్ అవతార్‌లో చరణ్ కనిపించబోతున్నాడు. స్క్రీన్‌పై ఆయన లుక్ ఇంకా పర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం గ్యారెంటీ అని విశ్లేషకులు భావిస్తున్నారు. బుచ్చిబాబు సన చరణ్ లోని మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.
‘పెద్ది’ మ్యూజికల్ అప్‌డేట్: పాటల లెక్క ఇదే!
ఇప్పటికే సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అవ్వగా, అవి యూట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇవే కాకుండా సినిమాలో ఇంకా చాలానే సాంగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కుస్తీ ట్రైనింగ్ సమయంలో వచ్చే సాంగ్, ఇంకా అలాగే మాంటెజ్ సమయంలో మూడు బిట్ సాంగ్స్, స్పెషల్ సాంగ్.. వీటితో పాటు ఒక్క స్పెషల్ సాంగ్ ఇది మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం పక్కా అంటున్నారు. ఒక బ్యూటిఫుల్ డ్యూయెట్ ట్యూన్ కూడా ప్రస్తుతం రెడీగా ఉంది. అయితే, ఈ ట్యూన్‌ను పూర్తిగా పాటగా మార్చి సినిమాలో యాడ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. ప్రస్తుతానికి ఉన్న లెంగ్త్ రీత్యా ఆ డ్యూయెట్ సాంగ్‌ను యాడ్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
