Ravi Teja's Irumudi

Ravi Teja’s Irumudi: ఇది కథ కావాల్సింది.. ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’ ఫిక్స్

Ravi Teja’s Irumudi: వరుస ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణతో ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సినిమా పైన ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

‘బంగారు పల్లకి’ రీమిక్స్‌తో రవితేజ మాస్ జాతర!

ఈ సినిమాలో అయ్యప్ప స్వామికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి గీతం “విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు.. ఎక్కినాడు బంగారు పల్లకి” పాటను రీమిక్స్ చేస్తున్నట్లు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ చెప్పారు.

ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు. సినిమా పోస్టర్ వచ్చినప్పటి నుండి రవితేజ ఫ్యాన్స్ సినిమాలో ఈ పాటను పెట్టాలని సోషల్ మీడియాలో మూవీ టీమ్‌కు రిక్వెస్ట్ చేశారు. ఫ్యాన్స్ కోసం ఈ సాంగ్ రైట్స్ కొనుగోలు చేసి మరీ రీమిక్స్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. రవితేజ మార్కు ఎనర్జీకి ఈ క్లాసిక్ సాంగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

ఇప్పటివరకు రవితేజ తన మాస్ క్యారెక్టర్స్‌తో థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తే, ఇప్పుడు స్వామి మాలలో తన భక్తితో పూనకాలు తెప్పించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

బలమైన ఎమోషన్.. తండ్రీ కూతుళ్ల కథ

‘ఇరుముడి’ కేవలం భక్తి నేపథ్యమే కాకుండా, తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ. హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *