Nara Lokesh

Nara Lokesh: ఎలా సార్ ఇలా.. రజినీకాంత్ నుంచి యువత ఎంతో నేర్చుకోవాలి

Nara Lokesh: బెంగళూరులో జరిగిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ (Art of Living) వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఆసక్తికర ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనలోని అహంకారం (ఇగో) ఎలా అణచివేయబడిందో ఆయన పంచుకున్న తీరుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ వినయ విధేయతలను కొనియాడుతూ లోకేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బుధవారం నాడు ప్రశంసల వర్షం కురిపించారు.

ఆశ్రమంలో రజనీకాంత్ ‘అహంకారం’ ఎలా క్రష్ అయ్యిందంటే?

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం అలాగే శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు:

హిమాలయాల తర్వాత తనకు ఈ ఆశ్రమం ఎంతో నచ్చిందని, నిజానికి రెండు రోజులు ఉందామని ప్లాన్ చేసి ఇక్కడ 15 రోజులు ఉండిపోయానని రజనీకాంత్ తెలిపారు.

ఒకరోజు వేదికపైకి వెళ్లే సమయంలో, తనను చూడగానే జనం ఎగబడతారని, ఆటోగ్రాఫ్‌లు, ఫొటోల కోసం తన వెంటబడతారని ఆయన మొదట భయపడ్డారు. కానీ అంతటి స్టార్‌డమ్ ఉన్న తనను చూడగానే జనం కేరింతలు కొడతారని ఆయనలో చిన్న ‘ఇగో’ (అహంకారం) కూడా ఆవహించింది.

కానీ ఆశ్చర్యకరంగా, అక్కడ ఎవరూ ఆయనను పట్టించుకోలేదు అక్కడి వారంతా ధ్యానంలో మునిగిపోయి ఉండటంతో అందరి దృష్టి కేవలం గురుదేవులపైనే ఉంది.

తాను ‘హాయ్’ అని చేతులు ఊపినా కనీసం ఒక్కరు కూడా తన వైపు చూడకపోవడంతో తన గర్వం పూర్తిగా అణచివేయబడిందని ఆయన నవ్వుతూ వెల్లడించారు. సెలబ్రిటీ హోదా అనేది వస్తుంటుంది, పోతుంటుంది కానీ ఆధ్యాత్మికతలో ఉండే హోదానే అత్యున్నతమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రి లోకేశ్ స్పందన.. ‘తలైవా హుందాతనం స్ఫూర్తిదాయకం’

బుధవారం ఉదయం నిద్రలేవగానే రజనీకాంత్ ప్రసంగం విన్న మంత్రి లోకేశ్, తలైవా ప్రదర్శించిన అణకువకు మంత్రముగ్ధులయ్యారు. ఈ మేరకు ఆయన ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు.

ఉన్నతస్థానంలో ఉన్న మీరు అంతటి స్టార్‌డమ్‌ను ఎంతో హుందాగా, వినయంగా స్వీకరించే విధానం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. విజయం సాధించినప్పుడు ఎలా ఒదిగి ఉండాలో నేటి యువతరం మీ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. మీలోని నిజాయితీ, హుందాతనం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి.

రజనీకాంత్ ప్రసంగం లోతైనదని మరియు సరళమైనదని పేర్కొన్న లోకేశ్, ఒక అభిమానిగా తన ప్రేమను మరియు ప్రశంసలను తలైవాకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *