NBK–Vivek Athreya

NBK–Vivek Athreya: బాలయ్య – వివేక్ ఆత్రేయ క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

NBK–Vivek Athreya: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీనిస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య, తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయబోతున్నారు. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో తన మార్క్ చాటుకున్న వివేక్ ఆత్రేయ, ఇప్పుడు బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతుండటం విశేషం. వివేక్ ఆత్రేయ ఈ స్క్రిప్ట్‌ను చాలా విభిన్నంగా డిజైన్ చేస్తున్నారట. కథ ప్రకారం రెండు పాత్రల్లోనూ బాలయ్య కనిపిస్తారా? లేక ఒక పాత్రలో బాలయ్య, మరో కీలక పాత్రలో ఇంకో స్టార్ హీరో ఉంటారా? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు వెర్షన్లు విన్న తర్వాత బాలయ్య తన తుది నిర్ణయాన్ని చెప్పనున్నారు. ఈ సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, ఈ ఏడాది చివర్లో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ స్టైల్ స్క్రీన్‌ప్లేకి బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *