Baahubali Vs Deva

Baahubali Vs Deva: ప్రభాస్ ని కొట్టేది ప్రభాస్ మాత్రమే.. బాహుబలిని కొట్టిన సలార్

Baahubali Vs Deva: ప్రపంచంలో అందరూ ఏఐని చూసి భయపడుతుంటే, మనోళ్లు మాత్రం ఏఐతో సోషల్ మీడియాలో సినిమాలు తీస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇంతకు ముందు రాజమౌళి ఇంకా మహేష్ బాబు ఫైట్ చేసుకుంటున్న వీడియోని క్రియేట్ చేసి ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. ఇప్పుడు దానికి మించి అంటూ ప్రభాస్ క్యారెక్టర్స్ తో చేసిన ఇంకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇప్పుడు ప్రభాస్ అనగానే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా, అందులో చేసిన అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ గుర్తొస్తుంది. కొన్నిసార్లు అందరికి అనిపిస్తుంది ఒకే హీరో చేసిన రెండు క్యారెక్టర్స్ ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారా అని అందరూ ఏదో ఒక సమయంలో అనుకొనే ఉంటారు. ఇప్పుడు ఏఐ సహాయంతో రెండు క్యారెక్టర్స్ మధ్య ఫైట్స్ పెట్టి ఎవరు గెలుస్తారో చెక్ చేస్తున్నారు.

అమరేంద్ర బాహుబలి ఇంకా సాలార్ లోని దేవా క్యారెక్టర్స్ మధ్య ఫైట్ పెట్టారు. ఇందులో బాహుబలి కొట్టిన దెబ్బకి దేవా పది అడుగులు ఎగిరి పక్కనే ఉన్న గోడని గుద్దుకొని లోపలికి వెళ్లిపోతాడు. వెంటనే పుంజుకున్న దేవా రెట్టింపు వేగంతో వచ్చి బాహుబలిపై గ్యాప్ ఇవ్వకుండా దెబ్బలు కొడుతూనే ఉంటాడు. చివరికి ఎవరు గెలిచారో మాత్రం మనకే వదిలేశారు.

కామెంట్స్ లో నెటిజన్లు ఇంకా అభిమానులు మాత్రం బాహుబలి క్యారెక్టర్ కి సపోర్ట్ చేస్తున్నారు. వంద మంది దేవలు వచ్చినా బాహుబలిని ఓడించలేరని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం దేవా ఇప్పటివరకు ఎవరిని ఇన్ని దెబ్బలు కొట్టింది లేదని, ఒక్క దెబ్బకే ఎవరినైనా పడగొడతాడని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీడియో ని ఇక్కడ చుడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *