Balakrishna

Balakrishna: డ్యూయల్ రోల్ లో బాలకృష్ణ.. వివేక్ ఆత్రేయ తో క్రేజీ ప్రాజెక్ట్..!

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరోలలో రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తూ ఇంకో సినిమా కూడా ఓకే చేశారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేనితో వీర సింహ రెడ్డి తర్వాత ఇంకో సినిమా చేస్తున్న బాలకృష్ణ, కొరటాల శివతో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అలాగే వివేక్ ఆత్రేయతో కూడా ఓ డిఫరెంట్ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.

మారుతున్న లైన్ అప్

వివేక్ ఆత్రేయ ముందు నుండే బాలకృష్ణతో సినిమా చేయాల్సి ఉంది కానీ మధ్యలో కొరటాల శివ రావడంతో లైన్ అప్ లో కొన్ని మార్పులు వచ్చాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో బిజీగా ఉండటంతో బాలకృష్ణతో సినిమాను అనౌన్స్ చేశారు కొరటాల. మరోవైపు వివేక్ ఆత్రేయ ‘కూలీ’ సినిమా తర్వాత రజనీకాంత్‌తో సినిమా చేయాల్సి ఉంది కానీ ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. దీంతో బాలకృష్ణకు ఓ స్టోరీ లైన్ చెప్పడంతో బాలకృష్ణ పాజిటివ్ గా స్పందించారు.

వివేక్ ఆత్రేయ మేకింగ్ స్టైల్

వివేక్ ఆత్రేయకి తనకంటూ ఓ స్టైల్ ఇంకా అభిమానాలు ఉన్నారు. ‘అంటే సుందరానికి’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి క్లాసిక్స్ తీస్తూనే ‘సరిపోదా శనివారం’ లాంటి మాస్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల్లో కూడా ఇదే ఆలోచన నెలకొంది. వివేక్ ఆయనతో క్లాసిక్ సినిమా తీస్తారా లేక మాస్ సినిమా చేస్తారా లేదా రెండు మిక్స్ చేసి ఎక్స్‌పెరిమెంట్ చేస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కానీ వివేక్ ఆత్రేయ మాత్రం బాలకృష్ణ మాస్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే స్క్రిప్ట్ రాస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో డ్యూయల్ రోల్ లో బాలకృష్ణని చూపించాలని చూస్తున్నారు. ఇలా కాకుండా ఇంకో హీరోతో బాలకృష్ణకు ఫేస్ ఆఫ్ పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. ఈ రెండు స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకొని వచ్చే లోపు ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ఏదో ఒకటి పూర్తవుతుంది. అప్పుడు ఈ సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది.

సామాజిక సందేశంతో బాలయ్య

బాలకృష్ణ ఇంతకుముందే ‘భగవంత్ కేసరి’ లాంటి ఎక్స్‌పెరిమెంట్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందరి హీరోల లాగా రొటీన్ సినిమా తీయకుండా తన ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ చేయడమే కాకుండా ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ లాంటి మంచి మెసేజ్ ఇచ్చారు. బాలకృష్ణ లాంటి హీరో ఇలాంటి మెసేజ్ లు చెబితే జనాల్లో అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు వివేక్ ఆత్రేయతో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుందో అని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *