Tollywood Changing: టాలీవుడ్ మారుతోంది. ఏడాదికి 200 నుండి 300 సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదల అవుతున్నాయి. 2022లో 297 సినిమాలు రిలీజ్ చేసి ఇండియాలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసిన ఇండస్ట్రీగా రికార్డు క్రియేట్ చేసింది. కానీ 2025లో 120 సినిమాలు మాత్రమే విడుదల చేసింది.
ఇంతకుముందు స్టోరీ నచ్చినా నచ్చకపోయినా, నోటెడ్ డైరెక్టర్ చిన్న హీరోకి కథ చెబితే నచ్చకపోయినా సినిమా చేసి ప్లాప్ ఇచ్చేవారు. అలాగే పెద్ద హీరోలకు ఏదైనా కథ నచ్చితే నిర్మాతలు ఖర్చు ఎక్కువైనా హీరోని నిరాశపరచొద్దని సినిమా చేసేవారు. అలా తీసిన సినిమాలు భారీగానే నష్టాలను మిగిల్చేవి.
కానీ టాలీవుడ్ లో కొంతకాలంగా నిర్మాతలు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సినిమా ఖర్చులపైనా చర్చలు జరుగుతున్నాయి. అంటే సినిమా కథకి అవసరం లేకపోయినా ఎక్కువగా ఖర్చు చేయడం వల్లే సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. దీంతో సినిమాని ఎక్కువ రేటుకు డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మడం, ఇంకా టికెట్ రేట్లు పెంచడం వంటివి చేస్తున్నారు. దీనివల్ల అంత ఖర్చు పెట్టి సినిమా చూసే బదులు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన తర్వాత చూద్దాం అని జనాలు భావిస్తున్నారు అని తెలుస్తుంది.
మారుతున్న టాలీవుడ్
ఇంతకుముందులాగా నోటెడ్ డైరెక్టర్స్.. ముందు సినిమా హిట్ కొట్టిన డైరెక్టర్స్ స్క్రిప్ట్ తీసుకొచ్చి సినిమా చేయాలని యంగ్ హీరోస్ ని అడిగితే, మొహమాటానికి పోకుండా స్టోరీ నచ్చకపోతే సినిమా చేయనని చెప్పేస్తున్నారు. మళ్ళీ ఇవే కథలు మళ్ళీ వేరే హీరోల దగ్గరికి వెళ్తున్నాయి.
స్టార్ హీరోస్ చిన్న డైరెక్టర్స్ లేదా పెద్ద డైరెక్టర్స్ చెప్పిన కథలు నచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నా, నిర్మాతలు మాత్రం బడ్జెట్ ఎక్కువ కావడంతో సినిమాలు చేయడం లేదు. ఇంతకుముందు హీరోతో రిలేషన్స్ పోతుందేమో అని ఒప్పుకున్నా, ఇప్పుడు వస్తున్న భారీ నష్టాల వల్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కథ బాగుంది, తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ తీసుకొని వస్తారు అనే నమ్మకం ఉంటేనే నిర్మాతలు సినిమాలను ఒప్పుకుంటున్నారు.
మారుతున్న టాలీవుడ్ లో ఇకనైనా నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు కలిసి ఇంతకుముందు జనరేషన్ చేసినట్టుగా మంచి కథాబలం ఉన్న స్టోరీస్ ని ఎంచుకొని టాలీవుడ్ నుండి ఇండియన్ సినిమాకి మంచి సినిమాలు ఇస్తారని భావిద్దాం.
