Crime News

Crime News: 18 నెలల చిన్నారిని హత్య.. వివాహేతర సంబంధమే కారణం.. నిజం చెప్పిన కొడుకు

Crime News: అక్రమ సంబంధంతో 18 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. 6 ఏళ్ల క్రితం ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 5 ఏళ్ల కుమారుడు ఇంకా 18 నెలల కూతురు ఉన్నారు. భర్త స్నేహితుడు శివతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఆ స్నేహం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. వీరిద్దరూ విజయవాడలోని సత్యనారాయణపురంలో ఓ గదిని అద్దెకు తీసుకుని అప్పుడప్పుడూ కలుసుకునేవారు. దీని కోసం ఆమె భర్తతో పుట్టింటికి వెళ్తున్నానని చెప్పేది.

ఆమెకు, శివకు మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది. మాటమాట పెరగడంతో కోపం తట్టుకోలేక పక్కనే ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిపైన కోపాన్ని చూపించాడు. చిన్నారిని గోడకేసి కొట్టడంతో మృతి చెందింది. విషయం బయటకి రాకుండా ఉండేందుకు ఆరోగ్యం బాగోలేక చిన్నారి మృతి చెందినట్టు భర్తకు చెప్పింది. అనుమానం వచ్చిన భర్త కొడుకుని ఏం జరిగింది అని అడగగా విషయం మొత్తం బయటపెట్టాడు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు నిజం బయటకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డొస్తుందని శివనే చంపేసినట్టు తెలిసింది. శివను పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *