Karthi

Karthi: కార్తీ, బోయపాటి సినిమా..? మధ్యలో నాగవంశీ

Karthi: కార్తీ ఓ తెలుగు స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నారు కాకపోతే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. కార్తీని తెలుగు ఇండస్ట్రీ దత్తత పుత్రుడు అనొచ్చు ఎందుకంటే ఆయనను తమిళ్ హీరోల కంటే తెలుగు హీరోలాగే చూస్తారు మన ఆడియన్స్. కానీ ఇప్పటివరకు ఎన్ని అవకాశాలు వచ్చినా సోలోగా ఓ తెలుగు సినిమా చేయలేదు. నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించినా అది మల్టీస్టారర్ కిందకే వస్తుంది. ఇన్నేళ్ల తర్వాత ఓ స్ట్రెయిట్ సినిమా చేద్దాం అనుకుంటే నాగవంశీ మధ్యలో వచ్చి ఈ సినిమాని ఆలస్యం చేస్తున్నారు.

బోయపాటి శ్రీను ‘అఖండ-2’ తర్వాత ఇంకో సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంకా హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, ఆయన మాత్రం టైమ్ తీసుకుని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తమిళ్ హీరో కార్తీని కలిసి స్టోరీ చెప్పగా ఆయనకి నచ్చింది. కానీ ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి టైమ్ పట్టేలాగా ఉంది. ఎందుకంటే కార్తీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమాకి కమిట్ అయ్యారు. ఇప్పుడు బోయపాటి సినిమా చేయాలంటే నాగవంశీ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

నాగవంశీ ఇప్పటికే ధనుష్ ఇంకా దుల్కర్ సల్మాన్, సూర్యలతో స్ట్రెయిట్ సినిమాలు చేశారు. ధనుష్‌తో ‘సార్’ అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే దుల్కర్‌తో ‘లక్కీ భాస్కర్’ తీసి బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా సీక్వెల్ కూడా చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఇక్కడే ఓ వింత ఉంది.. ఈ మూడు సినిమాలను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. ఒకవేళ కార్తీ సినిమా కూడా వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తారా లేకపోతే ఇంకో డైరెక్టర్ ని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

కార్తీ రెండు సినిమాలు ఒకేసారి చేస్తారా లేకపోతే ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తారా అనేది తెలియాలి. అలాగే ముందు నాగవంశీతో సినిమా స్టార్ట్ చేస్తే అది అయిపోయేవరకు బోయపాటి కార్తీ కోసం వెయిట్ చేస్తారా లేకపోతే ఇంకో హీరోతో సినిమా చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *