Tollywood Hero's

Tollywood Hero’s: హిట్టు ప్లాపులతో సంబంధం లేదు.. రాబోయే రెండేళ్లూ మన స్టార్ హీరోలదే హవా!

Tollywood Hero’s: 2026-2027 ఈ ఒక్క సంవత్సరం మన టాలీవుడ్‌లో ఉన్న ప్రతి స్టార్ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అనొచ్చు. ప్రతి హీరో తర్వాత చేస్తున్న సినిమాలు అన్నీ చూస్తే ఇదే అనొచ్చు. ముందు సినిమా ప్లాప్, హిట్ తో సంబంధం లేకుండా రిజల్ట్స్ రానున్నాయి. దీనికి తగ్గట్టుగానే నెక్స్ట్ మూవీస్‌లను ప్లాన్ చేసుకుంటున్నారు మన స్టార్ హీరోలు.

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా వారణాసి గురించి మాట్లాడుకుంటే ఇది హిట్ ప్లాప్ అని కాదు.. బ్లాక్ నుండి వరల్డ్ బస్టర్ అనే రేంజ్ లో హిట్ అవుతుందని అందరి నమ్మకం. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తుంటే, హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా, విలన్ క్యారెక్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి నచ్చే వరకు షూటింగ్ చేస్తూనే ఉంటారు. అవుట్‌పుట్ పైన క్లారిటీ వచ్చిన తర్వాత రిలీజ్ ఇంకా ప్రొమోషన్స్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సినిమా రిలీజ్ కి వన్ ఇయర్ ఉండగానే టైటిల్ రివీల్, ఇంటర్వ్యూస్.. ఇలా ప్రొమోషన్స్‌తో సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది సినిమా.

ప్రభాస్ ఇంకా సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పిరిట్ తో ప్రభాస్ పక్కా హిట్ కాదు బ్లాక్ బస్టర్ అందుకోనున్నారు. ప్రభాస్ లాస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’ నిరాశపరిచినా, ఇప్పుడు వచ్చే సినిమాలు అన్నీ హిట్ అవ్వడం కాయం. హను రాఘవపూడి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ.. ఇలా ప్రతి ఒక్కరూ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిమీద ఉన్నారు.

రామ్ చరణ్ పెద్ది సినిమాపైన ఇప్పటికే మార్కెట్‌లో పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి బుచ్చి బాబు సన డైరెక్ట్ చేస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ కావడం మాత్రమే కాకుండా రామ్ చరణ్ కెరీర్ లో రానివిధంగా విమర్శలు వచ్చాయి. అందుకే పెద్దిని పక్కా హిట్ కొట్టేలా రెడీ చేస్తున్నారు.

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో వస్తున్న రాకా సినిమా ఒక్క పోస్టర్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసేసింది. టైటిల్ రివీల్ మాత్రమే అని మూవీ టీమ్ చెప్పినా, పట్టించుకోని ఫ్యాన్స్ పోస్టర్ లో ఉన్న అల్లు అర్జున్ ని చూస్తూ మూవీ స్టోరీ థియరీస్ తయారు చేసేశారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం రికార్డ్స్ బ్రేక్ అవ్వడం కాయం. అలాగే దీని తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక్క సినిమా, అలాగే మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో మరో సినిమా చేయనున్నారు.

రాజమౌళి కర్స్‌ని ‘దేవర’ హిట్ తో బ్రేక్ చేసిన ఎన్టీఆర్, బాలీవుడ్ మల్టీస్టారర్ హృతిక్ రోషన్ తో చేసిన వార్-2 నిర్మాతలకు నష్టాలతోపాటు ఎన్టీఆర్ ఇమేజ్ కి తీవ్ర స్థాయిలో డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్‌తో బాలీవుడ్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీని తర్వాత దేవర-2 తో రానున్నారు.

నాని – శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ప్యారడైజ్ సినిమాపైన ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ (Expectations) ఎక్కువగా ఉన్నాయి. నాని కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల సినిమా దసరా. ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ కలిసి వస్తున్నారు అంటే సినిమా పైన అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే వచ్చిన సాంగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

ఇంకా విజయ్ దేవరకొండ చేతుల నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రానబలి, ‘రౌడీ జనార్ధన’, శౌర్యవ్‌తో సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా ఉన్నారు.

నాగచైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న వృషకర్మ సినిమాతో కూడా హిట్ అందుకునేలానే ఉన్నారు. ఇప్పటికే వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వృషకర్మ’ టీజర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. అందులో ఉన్న విజువల్స్ ఇంకా స్టోరీ పాయింట్ చూస్తుంటే ఈసారి నాగచైతన్య ఎక్స్‌ప‌రిమెంట్ చేస్తున్నట్టే తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *