chiranjeevi

Chiranjeevi: నువ్వు నా గర్వకారణం.. తనయుడు రామ్ చరణ్‌కు చిరంజీవి ఎమోషనల్ విష్!

Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడికి అత్యంత ప్రేమాపూర్వకమైన ఇంకా ఎమోషనల్ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. చరణ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానుల మనసు గెలుచుకుంటోంది. ఒక తండ్రిగా చరణ్ ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

చిరంజీవి తన పోస్ట్‌లో రామ్ చరణ్‌తో ఉన్న తన ఫోటోలను పంచుకున్నారు.. నా ప్రియమైన చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక నటుడిగానే కాకుండా, ఒక వ్యక్తిగా చరణ్ చూపిస్తున్న పరిణతి, క్రమశిక్షణ తనను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని ఆయన రాసుకొచ్చారు.

ఇదే సమయంలో చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్ర గ్లింప్స్ గురించి కూడా ప్రస్తావిస్తూ, చరణ్ కష్టపడే తత్వానికి తగిన ఫలితం లభిస్తుందని ఆకాంక్షించారు.

సోషల్ మీడియాలో మెగా సందడి

చిరంజీవి ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. 

“మెగాస్టార్ వారసుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తీరు అద్భుతం” అంటూ అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రముఖులు కూడా చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

 చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘పెద్ది’ గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, తండ్రి దీవెనలు తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మెగాస్టార్ తనయుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన రామ్ చరణ్, ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘RRR’ తర్వాత ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. చిరంజీవి తన ట్వీట్ ద్వారా చరణ్‌కు తండ్రిగా అండగా నిలుస్తూనే, ఒక నటుడిగా ఆయన సాధిస్తున్న విజయాలను అభినందించారు.

ImageImageImageImage

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *