Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు!

Balakrishna: తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుడు, ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణకు మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’ వేదికపై ఆయనకు ప్రతిష్టాత్మకమైన “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు” ప్రదానం చేశారు. దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.

ఈ వేడుకలో ఢిల్లీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీమతి గుప్తా రేఖ గారి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు చప్పట్లతో ఆయనను అభినందించారు. బాలయ్య బాబుగా పిలుచుకునే ఆయన, వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ వేదికపై అవార్డు అందుకోవడం ఆయన వ్యక్తిగత విజయమే కాదు, తెలుగు సినీ పరిశ్రమకే ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది.

బాలకృష్ణ గారు సాధించిన ఈ ఘనత పట్ల తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప చిత్రాల్లో నటించి, ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ పురస్కారం బాలయ్య కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా నిలిచిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *