Horoscope Today:

Horoscope Today: ఈరోజు ఏ రాశి వారికి అదృష్టం? ఎవరికి ధన లాభం? 12 రాశుల పూర్తి వివరాలు!

Horoscope Today: మార్చి 24, మంగళవారం నాడు గ్రహాల స్థితిగతులు మరియు నక్షత్ర సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు వెల్లడయ్యాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుందో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు. ముఖ్యంగా మిథున, మకరం వంటి రాశుల వారికి పదోన్నతి సూచనలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆదాయం బాగున్నా ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. భరణి నక్షత్రం వారికి అధిక లాభాలు చేకూరుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశినాథుడైన శుక్రుడి అనుగ్రహంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వారు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో పదోన్నతి (Promotion) పొందే సూచనలు ఉన్నాయి. జీతభత్యాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పునర్వసు నక్షత్రం వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అధికార యోగం పట్టనుంది. కొత్త నిర్ణయాలు లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. పుష్యమి నక్షత్రం వారు ఈ రోజు అత్యధిక ఆర్థిక ప్రయోజనం పొందుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి జీవితంలో మీ డిమాండ్ పెరుగుతుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. పుబ్బ నక్షత్రం వారికి శుభ ఫలితాలు మెండుగా ఉన్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉత్తర నక్షత్రం వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఇతర సంస్థల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్వాతి నక్షత్రం వారికి అదృష్టం వరిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): మీ ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. జ్యేష్టా నక్షత్రం వారికి అనుకూల సమాచారం అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి అదృష్ట కాలం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాజపూజ్యాలు కలుగుతాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం చేసినా విజయం మీ సొంతమవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఊహించని రాజయోగం పడుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): రాబడి వృద్ధి చెందుతుంది. ధనపరంగా ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ప్రయాణాలు పెట్టుకోవద్దు. శతభిషం నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సమయం బాగా కలిసి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *