Horoscope Today: మార్చి 23, 2026, సోమవారం నాటి రాశిఫలాల ప్రకారం చాలామందికి ఈరోజు అదృష్టయోగం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆదాయం పెరగడంతో పాటు పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో పనులు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ బాధ్యతలు కొంచెం పెరిగినా, శుభవార్తలు వినడం వల్ల మనసు సంతోషంగా ఉంటుంది. అయితే, ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.
వృషభ రాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఈ రోజు మీరు కుటుంబంతో కలిసి ఏదైనా ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల ఆనందంగా గడుస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువుల ఆరోగ్య విషయంలో స్వల్ప ఆందోళన కలగవచ్చు.
మిథున రాశి
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినప్పటికీ, పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది.
కర్కాటక రాశి
ఉద్యోగంలో పై అధికారులు మీపై నమ్మకంతో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాల్లో కొంచెం కష్టం ఉన్నా, దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల నుంచి మంచి వార్తలు వింటారు.
సింహ రాశి
వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా అనిపించినా, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. అనవసరమైన హామీలు ఇచ్చి ఇబ్బందుల్లో పడకండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
కన్య రాశి
చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు ఈ రోజు తీరుతాయి. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్త పరిచయాలకు దూరంగా ఉండటం, ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది.
తులా రాశి
ఆర్థికంగా ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే, పని భారం వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు, విశ్రాంతి తీసుకోవడం అవసరం.
వృశ్చిక రాశి
వృత్తి రీత్యా డాక్టర్లు, లాయర్లకు ఈ రోజు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మేలు. నిరుద్యోగులకు తమ సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పనులు కొంచెం ఆలస్యమైనా చివరకు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి
మీ మనసులోని ఒక కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఆదాయం పెరగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారంలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం.
మకర రాశి
ఈ రోజు మీకు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు వ్యాపారంలోనూ తీరిక లేకుండా గడుపుతారు. ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి సారిస్తారు. వివాహ ప్రయత్నాలకు ఈ రోజు అనుకూలమైన సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
కుంభ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కష్టపడితేనే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీన రాశి
ఉద్యోగంలో పని భారం ఉన్నప్పటికీ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆస్తి వివాదాలు ఉంటే ఈ రోజు అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే ఆలోచన చేస్తారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.
