Horoscope Today: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం (మార్చి 19, 2026) సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ పండుగ రోజున శుక్ల యోగం, మాళవ్య రాజయోగం వంటి శుభ యోగాలు ఏర్పడుతుండటంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది.
మేష రాశి:
వృత్తిపరంగా ఎదురయ్యే సవాళ్లను మీ చాకచక్యంతో అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక విషయాల్లో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి:
ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. విదేశీ యాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
మిథున రాశి:
పదోన్నతికి, అధికారానికి మార్గం సుగమం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వాహన యోగం ఉంది. అవివాహితులకు కల్యాణ యోగం బలంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కర్కాటక రాశి:
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే, అనవసర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది. బంధువులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మాట తీరుపై నిగ్రహం అవసరం.
సింహ రాశి:
ఆర్థికంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య రాశి:
నూతన పరిచయాలు లాభిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఇష్టదేవతారాధన వల్ల శుభ ఫలితాలు పొందుతారు.
తులా రాశి:
పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి అనుకూలమైన సమయం. కొత్త ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి:
వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు.
ధనుస్సు రాశి:
బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభసాటిగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం రాశి:
తోబుట్టవులతో అనుబంధం బలపడుతుంది. మార్కెటింగ్, రవాణా రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు.
కుంభ రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులపై సరైన నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ చేయడం వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీనం:
కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. పట్టుదలతో వ్యవహరించి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.
