Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ-పోన్ (Pre-poned) అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్చి 26న సినిమా రిలీజ్ అంటూ అఫీషియల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు సినిమా యూనిట్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ప్రకారం.. అనుకున్న డేట్ కంటే ఒక వారం ముందుగానే సినిమా థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంది. అంటే మార్చి 19న రిలీజ్ అవుతుంది. ఇదే నిజమైతే మాత్రం పవర్ స్టార్‌కి ఈసారి వన్ మంత్ కలిసి వచ్చినట్లే.
అది ఎలాగంటే.. మార్చి 18న ప్రీమియర్స్, 19న ఉగాది సందర్భంగా సినిమా రిలీజ్, మార్చి 20న రంజాన్, తర్వాత రోజు శనివారం, ఆదివారం. మార్చి 27న శ్రీరామనవమి, తర్వాత శనివారం, ఆదివారం, ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే. ఇలా చూసుకుంటే ‘పెద్ది’ సినిమా రిలీజ్ వరకు ఇంకో పెద్ద సినిమా లేకపోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వన్ మంత్ కలిసి వచ్చింది. సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లని ఎవరూ ఆపలేరు, తన పేరు మీద ఇంకో రికార్డు పెట్టడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.
సినిమా రిలీజ్‌కి ఇంకా 10 రోజులే ఉండటంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి తమన్‌ని తీసుకున్నారు చిత్ర యూనిట్. సాంగ్స్‌కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా, ఇప్పుడు సినిమాకి తమన్ కూడా రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘OG’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రాణం పెట్టేశాడు తమన్. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎలాంటి స్కోర్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
