Surya 46

Surya 46: క్లాస్ టైటిల్ తో వచ్చిన సూర్య.. రిలీజ్ డేట్ తో పోస్టర్ విడుదల

Surya 46: సూర్య 46వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా టైటిల్ మరియు రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్యకు జతగా మమితా బైజు నటిస్తోంది. అలాగే ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ నటి రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కనిపించబోతున్నారు.

ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు “విశ్వనాథ్ అండ్ సన్స్” అని ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. పోస్టర్‌లో సూర్య ఒక చిన్న బాబుని ఎత్తుకొని, చేతిలో పాల డబ్బా పట్టుకొని స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ స్టోరీ 45 ఏళ్ల వ్యక్తికి, 20 ఏళ్లలో ఉన్న యువతికి మధ్య జరిగే కథ అని.. వీరిద్దరి మధ్య డ్రామా చాలా బాగుంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

సూర్య ఈ మధ్య కాలంలో తమిళ సినిమాల్లో ఎక్కువగా రూటెడ్ (నేటివిటీ) కథలే చేస్తూ వచ్చారు. కానీ ఈసారి ట్రెండ్ మారుస్తూ ఒక క్లాసిక్ స్టోరీ చేస్తున్నారు. వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న సూర్యకు ఈ సినిమాతో ఎంత పెద్ద హిట్ ఇస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *