Vijay

Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?

Vijay: తమిళ చిత్రసీమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజమవుతూ, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

విజయ్ తనను మోసం చేస్తున్నారని, ఆయనకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. 1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇన్నాళ్లూ అన్యోన్యంగా ఉన్న ఈ స్టార్ కపుల్ మధ్య మనస్పర్థలు రావడం, అది విడాకుల వరకు వెళ్లడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గత ఏడాది కాలంగా విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్లకు సంగీత దూరంగా ఉండటంతోనే ఈ ప్రచారం మొదలైంది.

ప్రస్తుతం విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ద్వారా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో సొంత భార్య నుంచే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కోవడం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన ఆయన మద్దతుదారుల్లో నెలకొంది. ఈ వివాదంపై విజయ్ టీమ్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *