Vijay Rashmika Wedding: టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి ప్రేమ, పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, ఈ జంట గురువారం ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొద్దిసేపటికే రష్మిక తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేస్తూ, విజయ్‌ను “నా భర్త” అని అధికారికంగా పరిచయం చేసింది.
ఈ వివాహ వేడుక అత్యంత సన్నిహితుల మధ్య, కనుల పండువగా సాగింది. తెలుగు ఆచారాల ప్రకారం జరిగిన ఈ వేడుకలో విజయ్, రష్మికలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. తమ అభిమాన నటీనటులు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. రష్మిక షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.
మరో విశేషం ఏమిటంటే, ఉదయం తెలుగు పద్ధతిలో పెళ్లి పూర్తయ్యాక, రష్మిక టీమ్ సభ్యులు స్థానికులకు మిఠాయిలు పంచి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే వేడుకలు ఇక్కడితో ముగియలేదు. రష్మిక స్వస్థలం కూర్గ్ కావడంతో, గురువారం సాయంత్రం వీరిద్దరి వివాహం మళ్లీ కొడవ సంప్రదాయంలో జరగనుంది. ఒకే రోజు రెండు వేర్వేరు సంప్రదాయాల్లో జరుగుతున్న ఈ పెళ్లి వేడుక సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram
