Srikanth Odela: నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు (ఫిబ్రవరి 24, 2026) సందర్భంగా ఆయన అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో తన హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీకాంత్ ఓదెల చేసిన ఒక ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాని తనపై ఉంచిన అపారమైన నమ్మకం వల్లే ఈ సినిమా కోసం తాను ఏ స్థాయికైనా వెళ్తున్నానని శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు.
శ్రీకాంత్ తన ట్వీట్‌లో నానితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ.. “నాని అన్న.. నువ్వు ప్రతిసారి ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అన్నప్పుడల్లా నాకు అది ‘నేను నిన్ను నమ్ముతున్నాను శ్రీకాంత్’ అన్నట్లుగా వినిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతోంది. అందుకే ‘ది ప్యారడైజ్’ కోసం నా రక్తాన్ని, ఆత్మను ధారపోస్తున్నాను” అని పేర్కొన్నారు. నాని లాంటి స్టార్ హీరో ఒక యువ దర్శకుడికి ఇంతటి స్వేచ్ఛ ఇవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ది ప్యారడైజ్ కోసం నాని రూల్స్ మార్చుకున్నాడు..
సాధారణంగా నాని సినిమాలు ఒక పద్ధతి ప్రకారం సాగుతుంటాయి. కానీ ‘ది ప్యారడైజ్’ కోసం శ్రీకాంత్ నాని పాటిస్తున్న రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశారట.
- వర్కింగ్ స్టైల్: నాని వర్కింగ్ డేస్ ప్యాటర్న్‌ను శ్రీకాంత్ పూర్తిగా మార్చేశారు.
- టార్చర్ & రీటేక్స్: ఈ సినిమా కోసం నానిని జడలు వేసుకోమన్నా, పచ్చబొట్టు వేయించుకోమన్నా, ఎన్ని రీటేక్స్ తీసుకుని టార్చర్ పెట్టినా నాని కేవలం ‘నీ ఇష్టం’ అని మాత్రమే అన్నారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
- రిలీజ్ డేట్: నాని సినిమాల రిలీజ్ డేట్ ప్లానింగ్‌ను కూడా ఈ సినిమా కోసం మార్చాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.
‘ఆయా షేర్’ సాంగ్ సందడి
నాని బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుండి ‘ఆయా షేర్’ (Aaya Sher) అనే ఫుల్ సాంగ్‌ను నేడు సాయంత్రం విడుదల చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాటలో నాని మాస్ గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
