Mirzapur: ఓటీటీలో సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది. ఫీచర్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. పవర్ఫుల్ పోస్టర్‌తో మేకర్స్ తేదీని లాక్ చేశారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ఐకానిక్ పాత్రల్లో తిరిగి వస్తున్నారు. దివ్యేందు శర్మ మున్నా భయ్యాగా సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం.
‘మిర్జాపూర్’ సిరీస్ మూడు సీజన్ల పాటు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు థియేటర్లలో భారీ విధ్వంసం సృష్టించనుంది. కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డు పండిట్‌గా అలీ ఫజల్ తిరిగి కనిపిస్తారు. మరణించినట్లు చూపించిన మున్నా భయ్యా పాత్రలో దివ్యేందు శర్మ మళ్లీ వస్తున్నాడు. సోనాల్ చౌహాన్, జితేంద్ర కుమార్ వంటి నటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు థియేటర్లలో ఎలాంటి అనుభవం పొందుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
