Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. భాగ్యనగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ నరకానికి ముగింపు పలకడమే లక్ష్యంగా మెట్రో ఫేజ్-2 పనుల్లో వేగం పెంచింది. సుమారు 76.4 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించబోయే ఈ మెట్రో లైన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనివల్ల నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి శివారు ప్రాంతాల వరకు ప్రయాణం ఎంతో సులభం కానుంది.
ఈ రెండో దశలో భాగంగా మొత్తం ఐదు కొత్త కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ ఒకటి. విమానాశ్రయానికి వెళ్లేవారు ఇకపై గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా, చాలా వేగంగా చేరుకోవచ్చు. అలాగే ఐటీ ఉద్యోగుల కోసం రాయదుర్గం నుంచి కొకాపేట్ నియోపోలిస్ వరకు మరో కొత్త లైన్ రాబోతోంది. దీనివల్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లే వారికి ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది.
పాతబస్తీ వాసుల చిరకాల స్వప్నం కూడా ఈ దశలో నెరవేరబోతోంది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రోను విస్తరించడం ద్వారా పాత నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. దీనితో పాటు నగర శివార్లలో ఉండే మియాపూర్ – పటాన్చెరు, మరియు ఎల్బీనగర్ – హయత్‌నగర్ రూట్లలో కూడా మెట్రో పరుగులు తీయనుంది. ఈ మార్గాలన్నీ జాతీయ రహదారుల పక్కనే రావడం వల్ల రోడ్లపై ఉండే వాహనాల రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు కోసం 2026 జనవరిలోనే ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, భూసేకరణ పనులను కూడా వేగవంతం చేసింది. ఈ మెట్రో విస్తరణ వల్ల కేవలం ప్రయాణం సులభం అవ్వడమే కాదు.. కాలుష్యం తగ్గడం, ఇంధనం ఆదా అవ్వడంతో పాటు కొత్త ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మొత్తానికి ఫేజ్-2 పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోనున్నాయి.
Hyderabad Metro Phase II: Building the Next Chapter of Urban Mobility
Hyderabad is gearing up for a transformational leap in public transport. Phase II of Hyderabad Metro Rail will expand connectivity across key growth corridors, reduce congestion, and make every day travel… pic.twitter.com/Bcgpjwmgmw
— Hyderabad Metro Rail Ltd. (@HMRLHydmetro) February 3, 2026
