Delhi: తెలుగులో ఇద్దరికి పద్మశ్రీ.. వారు ఎవరంటే..?

Delhi: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన మొత్తం 45 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. వీరిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.

తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికు జంతు పోషణ, గ్రామీణ జీవనోపాధి అభివృద్ధి రంగాల్లో చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ పురస్కారం లభించింది. గ్రామీణ రైతులకు, పశుపోషణ రంగానికి ఆయన అందించిన సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్కు జన్యు పరిశోధన రంగంలో చేసిన ముఖ్యమైన సేవలకుగాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటించారు.

ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు సాహిత్యం, కళలు, సామాజిక సేవ, విజ్ఞానం, విద్య తదితర విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి అందించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తున్న “నిశ్శబ్ద హీరోలను” గుర్తించడం ఈసారి ప్రత్యేకతగా నిలిచింది. ఈ గుర్తింపు భవిష్యత్ తరాలకు ప్రేరణగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ జాబితాలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మణిపూర్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. సాహిత్యం, కళలు, ప్రజాసేవ, శాస్త్ర విజ్ఞానం వంటి రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులను దేశం గౌరవించడం ద్వారా వారి కృషిని ప్రజలకు తెలియజేయడం పద్మ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *