Telangana:

Telangana: ఇక అన్ని శాఖ‌ల్లో నూరుశాతం ఆన్‌లైన్ ఫైళ్లు.. 27 నుంచే అమ‌లు

Telangana: ఇక నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోప్ర‌భుత్వ కొత్త‌ ఫైళ్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే సాగ‌నున్నాయి. ఇక అధికారులు కాగిత‌పు ఫైళ్ల‌ను ప‌రిశీలించ‌బోరు. జిల్లా, రాష్ట్రస్థాయిలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో జ‌న‌వ‌రి 27 నుంచి ఫైళ్ల నిర్వ‌హ‌ణ‌ను నూరుశాతం ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హిస్తారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు ఈ విష‌యాన్ని పాటించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కే రామ‌కృష్ణారావు ఆదేశాలు జారీచేశారు.

Telangana: రాష్ట్ర ప్ర‌భుత్వ ఫైళ్ల‌ను ఫైళ్ల‌ను పూర్తిగా డిజిట‌ల్ విధానంలోనే నిర్వ‌హించ‌డానికి ఈ ఆఫీస్ పేరుతో నేష‌న‌ల్ ఇన్ఫర్మేటి్స్ సెంట‌ర్ (ఎన్ఐసీ) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను కొన్ని శాఖ‌ల్లో గ‌త కొన్నాళ్లుగా నిర్వ‌హిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, అట‌వీ, ఆర్థిక‌శాఖ‌, మైనింగ్‌ల‌తోపాటు స్పీడ్‌, జీహెచ్ఎంసీ వంటి ప్ర‌భుత్వ విభాగాలు ఇప్ప‌టికే వంద‌శాతం ల‌క్ష్యాన్ని సాధించాయి.

Telangana: ఈ ఆఫీస్ పాత సాఫ్ట్‌వేర్‌లోని ఇబ్బందుల‌ను అధిగ‌మించేందుకు ఇటీవ‌లే కొత్త వెర్ష‌న్‌ను వినియోగంలోకి తెచ్చారు. సులువుగా వినియోగించేలా కొత్త ఫీచ‌ర్‌ను ఐటీ శాఖ వ‌ర్గాలు అందుబాటులోకి తెచ్చాయి. ఇక స‌చివాల‌యంలోని అన్ని శాఖ‌ల కార్య‌ద‌ర్శుల కార్యాల‌యాల నుంచి త‌న కార్యాల‌యానికి ఫైళ్ల‌ను ఆన్‌లైన్ ద్వారానే పంపాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీచేశారు.

Telangana: అందుకే జ‌న‌వ‌రి 27 నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో సాధ్య‌మైనంత మేర‌కు కొత్త ఫైళ్ల‌ను ఆన్‌లైన్‌లో జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు అందాయి. పాత ఫైళ్ల‌ను అన్నింటినీ స్కానింగ్ చేసి ఈ ఆఫీస్ పోర్ట‌ల్‌లో ఆప్‌లోడ్ చేసి ఉంచాల‌ని అన్ని శాఖ‌ల‌ను ప్ర‌భుత్వం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *