Khammam: ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. మామిళ్లగూడెం హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న గౌతమి, పాఠాలు చెప్పడం మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలతో ఆమెను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
గౌతమి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూనే ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా రీల్స్ చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలు మరియు వ్యాపార సంస్థల ప్రమోషన్ల కోసం యాడ్స్‌లో నటించడం వంటి పనులు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. పాఠశాల సమయంలో కూడా విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టకుండా మొబైల్‌తోనే గడుపుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. గతంలోనే ఈ వ్యవహారంపై పైఅధికారులు ఆమెను హెచ్చరించినప్పటికీ, తన తీరు మార్చుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Cow Calf: అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఆవు దూడపై మైనర్ల అఘాయిత్యం..!
ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను మర్చిపోకూడదని, విధి నిర్వహణలో ఇటువంటి నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ జరుగుతోంది. ఉద్యోగంపై శ్రద్ధ లేకపోతే రాజీనామా చేసి పూర్తిస్థాయి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోవాలని కొందరు నెటిజన్లు ఆమెకు సూచిస్తున్నారు. సస్పెన్షన్ తర్వాతైనా ఆమె తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుందో లేదో వేచి చూడాలి.
