NBK 111

NBK 111: బాలయ్య భారీ చిత్రం పరిస్థితి ఏంటి?

NBK 111: నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో 111వ చిత్రంగా అనౌన్స్ అయిన NBK 111 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భలే ఆసక్తి రేపుతోంది. అఖండ 2 తాండవం తర్వాత గోపీచంద్ మలినేనితో ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలయ్య డబుల్ రోల్‌తో వారియర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి కొన్ని రూమర్లు వైరల్ అవుతున్నప్పటికీ ప్రాజెక్ట్ మాత్రం స్మూత్‌గా సాగుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Sinners: ఆస్కార్ 2026 నామినేషన్స్‌లో సిన్నర్స్ ఆల్-టైమ్ రికార్డ్!

బాలకృష్ణ ఇటీవల విడుదలైన అఖండ 2 తాండవంతో అంచనాలకు తగినట్లు రాణించలేకపోయాడు. అయితే రిలీజ్‌కు ముందే గోపీచంద్ మలినేనితో NBK 111 అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్‌తో వారియర్ అవతారంలో ఉంటాడని కన్ఫర్మ్ అయింది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇటీవల కథ మార్చారని, మరో కథతో షూట్ చేస్తారని కొన్ని రూమర్లు వచ్చాయి. అయితే అలాంటివి నిజం కాదని సమాచారం. గోపీచంద్‌ అనుకున్న స్టోరీతోనే సినిమా మొదలవుతుంది. కొంత సమయం పడుతుంది తప్ప ప్రాజెక్ట్ ఆగిపోలేదట. ప్రీ-ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో సాగుతోంది. షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌తో భారీ హిట్ రావాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *