Gold Price Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది నిజంగా మంచి వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం ధరలు ఊరటనిచ్చేలా తగ్గుముఖం పట్టాయి. నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గడంతో సామాన్యులకు కొంత ఊరట లభించినట్లయింది.
గత రెండు రోజుల క్రితం బంగారం ధర ఏకంగా 6 వేల రూపాయల వరకు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పన్నుల విధింపు నిర్ణయంపై వెనక్కి తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల మార్పులు వచ్చాయి. దీని ప్రభావం మన దేశంలోని బంగారం ధరలపై కూడా పడింది. ఫలితంగా ఈరోజు మార్కెట్లో ధరలు తగ్గుతూ కనిపించాయి.
తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి..
మన హైదరాబాద్ విషయానికి వస్తే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,300 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ. 10 తగ్గింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,41,440 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇతర నగరాల్లో ఎలా ఉందంటే..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,54,450 కాగా, 22 క్యారెట్లు రూ. 1,41,590 వద్ద ఉంది. అటు చెన్నైలో ధరలు ఇతర నగరాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ. 1,54,900 గా ఉంది. బెంగళూరులో హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి. మొత్తానికి నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గడం అనేది కొనుగోలుదారులకు మంచి అవకాశమే.
వెండి ధర కూడా దిగివచ్చింది..
కేవలం బంగారమే కాదు, వెండి కూడా వెనక్కి తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 3,39,900 వద్ద ఉంది, అంటే నిన్నటి కంటే రూ. 100 తగ్గింది. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ. 3,24,900 గా ఉంది. గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఇప్పుడు తగ్గడంతో, రాబోయే రోజుల్లో ధరలు ఇంకా తగ్గుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
