Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ 54వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. “హ్యాపీ బర్త్ డే NSG.. ప్రతి విషయంలోనూ ఎంతో ఓపికతో, ప్రేమతో నాకు తోడుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు. అంతకంటే ఎక్కువ నేనేమీ కోరుకోలేను” అంటూ మహేష్ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. 2005లో వివాహం చేసుకున్న ఈ జంట టాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత తన నటనకు స్వస్తి చెప్పి, మహేష్ కెరీర్ బాధ్యతలను, కుటుంబ వ్యవహారాలను ఒక పర్ఫెక్ట్ మేనేజర్‌లా చూసుకుంటున్నారు.
మరోవైపు, మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB 29) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ప్రత్యేక సెట్స్‌లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఒక భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, తన భార్య పుట్టినరోజున ఆమెకు ప్రాధాన్యతనిస్తూ మహేష్ చేసిన పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం మహేష్ మాత్రమే కాకుండా, పిల్లలు గౌతమ్, సితార కూడా తమ అమ్మకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
View this post on Instagram
