Bollywood: ఇండియన్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడు బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్లు మారిపోయింది. 2015లో సినిమా రిలీజ్ అవ్వడంతోనే అప్పటివరకు నెంబర్ 1లో ఉన్న బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు సంవత్సరాల్లోనే మొదటి స్థానం నుండి సెకండ్ ప్లేస్ కి వచ్చేసింది. అప్పటి నుండి ఇప్పటివరకు తన ప్లేస్ లోకి వెళ్లడానికి బాలీవుడ్ ప్రయత్నిస్తుంది.
ఒకప్పుడు ఇండియన్ సినిమా గురించి ఎవరైనా మాట్లాడాలంటే బాలీవుడ్ గురించే చెప్పేవారు. అక్కడి సినిమాలకి హిందీ ఆడియన్స్ నుండి వచ్చే ఆదరణ ఎక్కువగా ఉండటంతో వాళ్లు తీసిన సినిమాలకి కలెక్షన్స్ ఇంకా రీచ్ ఎక్కువగా ఉండేది. దీనితో పాటు బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ మన హీరోలతో పోలిస్తే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా ఉండేది. ఇండియాలో హిందీ మాట్లాడే వారు ఎక్కువగా ఉండటంతో బాలీవుడ్ సినిమాలకి ఆడియన్స్ ఎక్కువగా ఉండేవారు. దీనితో అక్కడి హీరోలు ఎక్కువమందికి తెలిసేవారు. మన సౌత్ విషయానికి వస్తే ఇక్కడ మంచి సినిమాలు ఉన్నా, వాటి రీచ్ రీజియన్ వరకు మాత్రమే ఉండేది. ఓటీటీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది అనుకోండి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ సదస్సు.. తెలంగాణకు రూ.19వేల500 కోట్ల పెట్టుబడులు
కూలిపోయిన తన స్థానాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి బాలీవుడ్ చేయని ప్రయత్నం లేదు. సల్మాన్ ఖాన్ నుండి అమీర్ ఖాన్ వరకు అందరూ ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. ఇదే సమయం అనుకున్న కన్నడ ఇండస్ట్రీ రెండో స్థానం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా వచ్చిన సినిమానే కేజీఎఫ్. కేజీఎఫ్ అక్కడ కలెక్షన్స్ సునామీ సృష్టించింది.
2024లో కూడా బాలీవుడ్ ని రూల్ చేసింది తెలుగు సినిమాలే. కల్కి, పుష్ప-2 సినిమాలు అక్కడ కలెక్షన్స్‌తో పాటు అక్కడి ఆడియన్స్ ని సినిమా ట్రాన్స్‌లోకి తీసుకొని వెళ్ళాయి. ఈ విషయంలో పుష్ప-2 గురించి తెలిసిందే. కానీ 2025లో టాలీవుడ్ హవా బాలీవుడ్ లో తగ్గింది అని చెప్పవచ్చు. ఇంకా కొన్ని రోజుల్లో ఇయర్ అయిపోతుంది అనుకుంటున్న సమయంలో, బాలీవుడ్ నుండి ‘ధురంధర్’ సినిమా రిలీజ్ అవ్వడం, అప్పటివరకు చూడని కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ కి కొంత నమ్మకం వచ్చింది.
సింగిల్ లాంగ్వేజ్ లో 1300 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పుష్ప-2 బాలీవుడ్ లో 800 కోట్లు వసూలు సాధించి రికార్డు కొట్టింది. 2 ఇయర్స్ తర్వాత ‘ధురంధర్’ 1300 కోట్లు కలెక్ట్ చేసి పుష్ప-2 రికార్డు బద్దలు కొట్టి కొత్త రికార్డు సృష్టించింది.
2026లో బాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్న ధురంధర్-2, షారుక్ ఖాన్ (కింగ్), ‘బోర్డర్ 2’, షాహిద్ కపూర్ ‘ఓ రోమియో’ సినిమాలతో 5000+ కోట్ల కలెక్షన్స్ రానున్నట్లు బాలీవుడ్ భావిస్తుంది.
కన్నడ నుండి యష్ ‘టాక్సిక్’ సినిమాతో వస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ ‘రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ ‘పెద్ది’, నాని నుండి ‘ది పారడైస్’ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ లు ఉన్నాయి.
