Salaar-2: ప్రభాస్ 2026 సంక్రాంతికి ‘రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా అభిమానులు మాత్రం నిరాశ చెందడం లేదు. ఎందుకంటే ప్రభాస్ లైనప్‌లో ఉన్న తదుపరి సినిమాలు చూస్తుంటే ప్రతిదీ 500 నుండి 1000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టే రేంజ్లో ఉన్నాయి. స్పిరిట్, సాలార్-2, కల్కి-2, ఫౌజీ వంటి భారీ ప్రాజెక్టులతో రాబోయే సంవత్సరాల్లో బాక్సాఫీస్ రికార్డులను సృష్టించడం పక్కా అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, జనవరి 26 గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా ప్రభాస్ సినిమాల నుండి కొత్త పోస్టర్లు లేదా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ‘సాలార్-2’ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉందంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Naa Anveshana: 2026 బెస్ట్ స్పీచ్ ఇదే.. రేణు దేశాయ్ కి సపోర్ట్ ఇస్తున్న అన్వేష్
కానీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ టీమ్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఒక షెడ్యూల్ ముగించుకొని, తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ ‘సాలార్-2’ గ్లింప్స్ విడుదల చేస్తారనే వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే జనవరి 26 వరకు వేచి చూడాల్సిందే.
ప్రస్తుతానికి ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్ ‘సాలార్-2’ని పట్టాలెక్కిస్తారు. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా తర్వాత యశ్‌తో ‘కేజీఎఫ్-3’ తీస్తారా లేక వెంటనే ‘సాలార్-2’ మొదలుపెడతారా అనేది కాలమే నిర్ణయించాలి.
