Naa Anveshana: సినీ నటి రేణు దేశాయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. వీధి కుక్కలను చంపుతున్న ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వ్యవస్థలోని అవినీతిపై పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం జంతువుల సంరక్షణ గురించే కాకుండా.. మన రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన లోపాలపై ఆమె అత్యంత ఘాటుగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
రేణు దేశాయ్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నాయుడు) ఆమెకు అండగా నిలిచారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు విన్న అత్యుత్తమ ప్రసంగం ఇదేనంటూ ఆయన ఆమెను ప్రశంసించారు. శివాజీ మహరాజ్ వారసురాలిగా ఒక మరాఠీ మహిళ ఇంత ధైర్యంగా వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించడం గొప్ప విషయమని కొనియాడారు. భయం లేకుండా నిజాలు మాట్లాడిన రేణు దేశాయ్ నిజమైన ధైర్యవంతురాలని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Karnataka DGP: ఆఫీసులోనే రాసలీలలు.. డీజీపీ స్థాయి అధికారి సస్పెన్షన్
అన్వేష్ ఈ సందర్భంగా భారతదేశంలోని రాజకీయ వ్యవస్థపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో దాదాపు 4,500కు పైగా రాజకీయ పార్టీలు ఉండటమే అవినీతి పెరగడానికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో మాదిరిగా తక్కువ పార్టీలు ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, కానీ ఇక్కడ వేల సంఖ్యలో పార్టీలు ఉండటం వల్ల రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేణు దేశాయ్ లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఒక అంశానికే పరిమితం కాకుండా, సమాజంలోని మూలాలను కదిలించేలా ఉన్నాయని ఆయన మద్దతు తెలిపారు.
