Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణపై ఆందోళన కలిగిస్తూ మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజ్‌బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న 30 ఏళ్ల రిపోన్ సాహా అనే హిందూ యువకుడిని కారుతో ఢీకొట్టి అత్యంత దారుణంగా హత్య చేశారు. గత మూడు వారాల్లోనే బంగ్లాదేశ్‌లో పది మందికి పైగా హిందువులు హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది.
శుక్రవారం జరిగిన ఈ ఘటన.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ తన కారులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అయితే, పెట్రోల్ బిల్లు చెల్లించకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, విధి నిర్వహణలో ఉన్న రిపోన్ సాహా కారును అడ్డుకుని డబ్బులు అడిగాడు. ఇంధనం డబ్బులు అడిగినందుకు ఆగ్రహించిన హషేమ్, తన కారును రిపోన్ పైకి వేగంగా దూసుకుపోనిచ్చాడు. కారు కింద పడి తీవ్రంగా గాయపడిన రిపోన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: Cm revanth: 25 ఏళ్లు శ్రమించి చదివితే, తర్వాతి 75 ఏళ్లు గౌరవంగా జీవించవచ్చు
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న రాజ్‌బరి జిల్లా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు అబుల్ హషేమ్‌తో పాటు అతడి కారు డ్రైవర్ కమాల్ హొసేన్‌ను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు చీఫ్ ఖొండాకర్ జియావుర్ రహ్మాన్ వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్న తరుణంలో, రిపోన్ సాహా హత్య అక్కడి హిందూ సమాజంలో తీవ్ర భయాందోళనలను నింపుతోంది.
