Hyderabad: తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం మేయర్లు మరియు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 పదవులు కేటాయించగా, మహిళలకు మొత్తం పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ వర్తింపజేశారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాయి. ముఖ్యమైన కార్పొరేషన్‌లలో కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల మరియు కరీంనగర్ బీసీ జనరల్‌గా నిర్ణయించగా, GHMC, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లను జనరల్ మహిళ కేటగిరీకి కేటాయించారు. గ్రేటర్ వరంగల్ జనరల్ కేటగిరీగా ఖరారైంది. ఈ రిజర్వేషన్లు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తాయి.
