IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ కీలక పోరు గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో గల నిరంజన్ షా స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా, ఒంటి గంటకు టాస్ వేయనున్నారు. ఇప్పటికే వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది.
నేటి మ్యాచ్లో కూడా గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలని శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బదోనీ తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు.గత మ్యాచ్లో 93 పరుగులతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ, కెప్టెన్ గిల్, రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Ponglueti srinivas: అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలి
బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు.సిరీస్ను సమం చేయాలంటే కివీస్ జట్టుకు ఈ మ్యాచ్లో విజయం తప్పనిసరి. కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని చూస్తున్నారు. మొదటి వన్డేలో 300 పరుగులు చేసినప్పటికీ, భారత బ్యాటర్లను అడ్డుకోవడంలో కివీస్ బౌలర్లు విఫలమయ్యారు. రాజ్కోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు బాగా సహకరిస్తుంది, కాబట్టి నేడు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
