Tamilnadu:

Tamilnadu: త‌మిళ‌నాడులో అమిత్‌షా పాచిక పారేనా?  ఎన్డీయే కూట‌మిలో విజ‌య్ పార్టీ చేరేనా?

Tamilnadu:భార‌తదేశంలో అత్య‌ధిక రాష్ట్రాల్లో అప్ర‌తిహాత విజ‌యంతో ద‌శాబ్ద‌కాలంగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ సార‌ధ్యంలోని ఎన్డీయే కూట‌మి ద‌క్షిణాది రాష్ట్రాల‌పై క‌న్నేసింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని త‌న మ‌ద్ద‌తుతో వ‌శ‌ప‌రుచున్న ఆ కూట‌మి.. త‌మిళ‌నాడు, తెలంగాణ‌, కేర‌ళ‌ను వ‌శ‌ప‌రుచుకోవాల‌ని చూస్తున్న‌ది. తెలంగాణ‌, కేర‌ళ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రింత కాలం ఉండ‌గా, త‌మిళ‌నాడులో ఈ ఏడాదే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది. దీంతో ఎన్డీయే ముఖ్యంగా బీజేపీ త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై అజ‌మాయిషీకి ఆరాట‌ప‌డుతున్న‌ది. ఆ బాధ్య‌త‌ల‌ను కేంద్ర మంత్రి, బీజేపీ కీల‌క నేత అమిత్‌షాకు అప్ప‌గించింది.

Tamilnadu:త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న‌ది. ఇదే స‌మ‌యంలో జ‌యల‌లిత మ‌ర‌ణం, శ‌శిక‌ళ జైలు పాలయ్యాక ఏఐఏడీఎంకే పార్టీ బ‌ల‌హీన ప‌డింది. మ‌రి ఈ ద‌శ‌లో అధికార ప‌క్ష‌మైన‌ డీఎంకేను ఢీకొని అధికారాన్ని ఎన్డీయే ప‌క్షానికి క‌ట్ట‌బెట్టాలంటే కేవ‌లం ఏఐఏడీఎంకే పార్టీతో జ‌ట్టుక‌డితే స‌రిపోదు. ఈ ద‌శ‌లోనే ఇటీవ‌ల పార్టీని స్థాపించి ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ పార్టీ అయిన త‌మిళ వెట్రి క‌జ‌గం (టీవీకే)తో పొత్తుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతున్న‌ది.

Tamilnadu:అయితే టీవీకే ప్ర‌క‌ట‌న నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ పార్టీ అధినేత విజ‌య్ త‌న పంథాను ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్నారు. కాషాయ విధానాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని చెప్తూ వ‌స్తున్నారు. మ‌త, కుల‌ప‌ర రాజ‌కీయాల‌కు తాను దూర‌మ‌ని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. అటు స్టాలిన్ నాయ‌క‌త్వంలోని డీఎంకే పార్టీ విధానాల‌నూ వ్య‌తిరేకిస్తూ ఉన్నారు. అంటే తాను ఇటు బీజేపీ కూట‌మి, అటు కాంగ్రెస్ కూట‌మి రాజ‌కీయ విధానాల‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు.

Tamilnadu:ఈ నేప‌థ్యంలో విశ్లేష‌కులు సైతం బీజేపీకి విజ‌య్ పార్టీ దూరంగానే ఉంటుంద‌ని భావిస్తూ వ‌చ్చాయి. ఈ ద‌శ‌లోనే బీజేపీ ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా అలుపెర‌గ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. విజ‌య్ పార్టీ అయిన టీవీకేతో పొత్తుకు మంత‌నాలు జ‌రుపుతూనే ఉన్నారు. తొలి ద‌శ‌లో కొంత వ్య‌తిరేక‌త‌ను ప్ర‌ద‌ర్శించిన విజ‌య్‌.. కాస్త మెత్త‌బ‌డిన‌ట్టుగా క‌నిపిస్తున్న‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. విజ‌య్ నుంచి ఎంత‌లా వ్య‌తిరేక‌త వ‌చ్చినా అమిత్ షా మాత్రం అలుపెర‌గ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. నయానో, భ‌యానో విజ‌య్ పార్టీని ఎన్డీయే కూట‌మిలో చేర్చ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న పాచిక‌లు ప‌న్నుతున్నారు.

Tamilnadu:రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. అమిత్ షా ఇటీవ‌లే త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత విజ‌య్ టీంతో బీజేపీ అధిష్టానం ట‌చ్‌లోకి వెళ్లింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా విజ‌య్ త‌న స్వ‌తంత్ర‌తను కాపాడుకునేందుకే ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు చెప్తూ వ‌స్తున్నారు. ఇదే ద‌శ‌లో ఇటీవ‌ల పార్టీ స‌భ‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీబీఐ ఎంట‌రైంది. ఆ సంఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు త‌మ వ‌ద్ద హాజ‌రుకావాలంటూ ఆయ‌నకు తాజాగా నోటీసులు అందాయ‌ని స‌మాచారం.

Tamilnadu:అందుకే న‌యాన విన‌కుంటే భ‌యాన అయినా విజ‌య్ పార్టీని ఎన్డీయే కూట‌మిలో చేర్చాల‌ని చూస్తున్నారు. ఒక‌వేళ పొత్తు కుదిరితే అది సీట్ల స‌ర్దుబాటుకే ప‌రిమితం అవుతుందా? లేక అధికారం పంచుకునే వ‌ర‌కూ చేరుతుందా.. అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌వేళ పొత్తే కుదిరితే విజ‌య్ పార్టీకి జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. కానీ, రాష్ట్రంలోని మైనార్టీలు, సెక్యూల‌ర్ వ‌ర్గాలు దూర‌మ‌వుతాయ‌ని విశ్లేష‌కుల‌ అంచ‌నా.

Tamilnadu:ఈ సారి త‌మిళ‌నాడును కైవ‌సం చేసుకోవాలంటే విజ‌య్ పార్టీని వ‌దులుకోవ‌ద్ద‌నే సూత్రాన్ని అమిత్‌షా బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు తెలుస్తున్న‌ది. అవ‌స‌ర‌మైతే ముందుస్తుగానే విజ‌య్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని తేల్చి చెప్తున్నారు. విజ‌య్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న‌ద‌ని దానిని ఉప‌యోగించుకుంటే అధికారం కైవ‌సం చేసుకోవ‌డం ఈజీ అవుతుంద‌ని బీజేపీ భావిస్తున్న‌ది. అనూహ్య ఆలోచ‌న‌లు చేసే అమిత్ షా పాచిక త‌మిళ‌నాడులో ఈసారైనా పారుతుందా? లేక విఫ‌ల‌మ‌వుతుందా? మ‌రికొద్ది రోజుల వ‌ర‌కూ వేచి చూడాలి మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *