Hyderabad: ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాల నిర్మాతలు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు అప్పీలు దాఖలు చేశారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అప్పీల్లో నిర్మాతలు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
