Adilabad: రైతుల తరఫున పోరాడుతున్న మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రైతులతోపాటు ఆయనను కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం (జనవరి 6) చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా బంద్ ఉద్రిక్తంగా మారింది. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆందోళనకు దిగిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకన్నది.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు బీఆర్ఎస్‌తోపాటు అఖిలపక్ష రైతు, ప్రజా సంఘాల నేతలు, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ఎదుట మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోయా పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఈ సందర్భంగా జోగు రామన్న ధ్వజమెత్తారు.
Adilabad: ఈ క్రమంలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కాసేపు తోపులాట చేసుకన్నది. కూర్చొని ఆందోళనలో పాల్గొన్న జోగు రామన్న పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకులను మావల పోలీస్‌షన్‌కు తరలించారు.
