Bhagyashri Borse: అక్కినేని అఖిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆమె ఈ చిత్రంలో ‘భారతి’ అనే పాత్రలో కనిపించనున్నారు. “వారెవ్వా వారెవ్వా.. వావ్వా వావ్వా వారెవ్వా.. లెనిన్ ప్రేమ ‘భారతి’ని పరిచయం చేస్తున్నాం” అంటూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టర్‌ను పంచుకుంది.
నిజానికి ఈ సినిమాలో మొదట శ్రీలీల కథానాయికగా ఎంపికయ్యారు. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో కూడా ఆమె కనిపించారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా, ఆ స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరారు. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీకి, అఖిల్ సరసన ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: Godari Gattupain: పల్లెటూరి ఉల్లాసంతో ఆకట్టుకుంటున్న ‘గోదారి గట్టుపైన’ టీజర్!
ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను జనవరి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్ ద్వారా సినిమాను 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమైంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ డ్రామాలో అఖిల్ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ‘యుద్ధం కంటే హింసాత్మకమైనది ప్రేమలో లేదు’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
View this post on Instagram
