Gali janardhan: ఫ్యాక్షన్ సినిమా తరహాలో భరత్‌రెడ్డి వ్యవహారం: మాజీ మంత్రి గాలి

Gali janardhan: బళ్లారిని గత 30 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం నుంచి అక్రమాలకు నిలయంగా మార్చారని స్థానిక ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిపై మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే చేయని దందా లేదని, ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా ఎమ్మెల్యే మరియు ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాత్రి జరిగిన గొడవపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని గాలి తెలిపారు. తనపై దాడి చేస్తే దేశవ్యాప్తంగా పేరు వస్తుందనే ఉద్దేశంతోనే భరత్‌రెడ్డి ఈ విధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. బళ్లారిలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు భయాందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *