Spirit

Spirit: స్పిరిట్: రూత్‌లెస్ కాప్‌ ప్రభాస్!

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు 2026 నూతన సంవత్సరం ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంతో మొదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ పోస్టర్ ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. పోస్టర్‌లో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక ‘రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్’ అవతారంలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒళ్లంతా గాయాలతో, బ్యాండ్-ఎయిడ్‌లు కట్టుకుని, వీపు వైపు తిరిగి ఉన్న ప్రభాస్ కటౌట్ చూస్తుంటే.. సందీప్ వంగా మార్క్ యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందో ఇట్టే అర్థమవుతోంది.

Also Read: Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డబుల్ ట్రీట్: సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా

ఈ ఇంటెన్స్ పోస్టర్‌లో మరో ప్రధాన ఆకర్షణ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ప్రభాస్ నోటిలోని సిగరెట్‌ను ఆమె వెలిగిస్తున్న దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ రా అండ్ రస్టిక్‌గా ఉంటూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. “ఇండియన్ సినిమా.. మీ ఆజానుబాహుడిని చూడండి” అంటూ సందీప్ వంగా ఈ పోస్టర్‌ను పరిచయం చేయడం విశేషం. కేవలం ఒక పోలీస్ ఆఫీసర్ కథగానే కాకుండా, అకాడమీ టాపర్ అయిన ఒక ఐపీఎస్ అధికారి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే విభిన్న కోణంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సందీప్ వంగా, ఇప్పుడు ప్రభాస్‌ను ఒక కఠినమైన పోలీస్ పాత్రలో ఎలా చూపించబోతున్నారనేది యావత్ భారత సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ దక్కినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *