Telangana: జర్నలిస్టుల అక్రెడిటేషన్ల గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. దీంతో నూతన అక్రెడిటేషన్ల కార్డుల జారీలో జాప్యం జరుగుతుంది. డిసెంబర్ 31తో రెన్యువల్ గడువు ముగిసిపోతుండగా, దానిని 2026 ఫిబ్రవరి 28 వరకు సమాచార పౌరసరఫరాల శాఖ అధికారులు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
Telangana: నూతన అక్రెడిటేషన్ల జారీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో 252ను జారీ చేసింది. ఈ జీవోపై జర్నలిస్టులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తంచేశారు. జర్నలిస్టుల కుదింపు, రెండు కార్డుల విధానం, ఇతర నిబంధనలపై జర్నలిస్టు సంఘాల నుంచి కూడా వ్యతిరేక వ్యక్తమైంది. ఈ నూతన జీవోను వెంటనే సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
Telangana: ఇదే సమయంలో డెస్క్ జర్నలిస్టులు నూతన జీవోపై భగ్గుమన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేసి, వినతిపత్రాలను అందజేశారు. జీవో 252ను సవరించాలని డిమాండ్ చేశారు. మీడియా కార్డుల పేరిట డెస్క్ జర్నలిస్టులకు ఇస్తామన్న విధానాన్ని రద్దు చేయాలని, అక్రెడిటేషన్ కార్డులే జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Telangana: ఈ నేపథ్యంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డెస్క్ జర్నలిస్టులు, ఇతర జర్నలిస్టు సంఘాలు డిసెంబర్ 30న కలిసి వినతిపత్రాలు సమర్పించాయి. జీవో 252ను సవరించాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి సానుకూలంగా స్పందించారు. అన్ని సంఘాలతో మరోసారి చర్చించి సమరణపై నిర్ణయం తీసుకుంటామని ఆయా సంఘాలకు హామీ ఇచ్చారు. అనంతరమే జర్నలిస్టుల పాత అక్రెడిటేషన్ల గడువును పొడిగిస్తూ సమాచార శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
