Emanuel

Emanuel: సంజనతో అనుబంధం చాలా ప్రత్యేకం

Emanuel: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ముగిసింది. ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా కళ్యాణ్ నిలిచినప్పటికీ, ప్రేక్షకులను తనదైన కామెడీతో, అద్భుతమైన ఆటతీరుతో కట్టిపడేసిన కంటెస్టెంట్ ఎవరంటే టక్కున వినిపించే పేరు ‘జబర్దస్త్’ ఇమ్మాన్యూయెల్. జబర్దస్త్ స్టేజ్ మీద నవ్వులు పూయించే సాధారణ కమెడియన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఇమ్మాన్యూయెల్, టాస్కుల్లో చూపించిన తెగువ, కెప్టెన్‌గా నిర్వహించిన బాధ్యతలు చూసి అతనే విన్నర్ అని అంతా భావించారు. అయితే చివరికి టాప్ 4 పొజిషన్‌తోనే ఇమ్మాన్యూయెల్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గతంలో రోహిణి అన్నట్టుగానే ‘కమెడియన్లకు కప్పులు దక్కవు’ అనే సెంటిమెంట్ ఇమ్మాన్యూయెల్ విషయంలోనూ నిజమైందని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆటలో ఎంత తోపు అనిపించుకున్నా, చివరి వారాల్లో ఓట్ల వేటలో పీఆర్ టీమ్ వ్యూహాలు ఫలించకపోవడం కూడా అతనికి మైనస్ అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 105 రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో గెలుపు అంచు దాకా వెళ్లిన ఇమ్మాన్యూయెల్, తన జర్నీ ముగిసిన తర్వాత ఎంతో ఎమోషనల్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: Actress Nandini: సీరియల్ నటి నందిని ఆత్మహత్య

హౌస్‌లోని తన అనుబంధాల గురించి మాట్లాడుతూ, సంజన గల్రానీతో తనకున్న బంధం చాలా ప్రత్యేకమని ఇమ్మాన్యూయెల్ గుర్తు చేసుకున్నాడు. ఆమె తనను సొంత బిడ్డలా ఆదరించిందని, ఆ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువలేనని భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే బిగ్ బాస్ హౌస్ లో నటిస్తారనే మాటలపై స్పందిస్తూ.. గంటో రెండు గంటలో నటించొచ్చు కానీ, వంద రోజులకు పైగా ఎవరూ నటించలేరని, అక్కడ ప్రతి ఒక్కరి అసలు నైజం బయటపడాల్సిందేనని కుండబద్దలు కొట్టాడు.

తన స్నేహితుడు కళ్యాణ్ విజేతగా నిలవడంపై ఇమ్మాన్యూయెల్ సంతోషం వ్యక్తం చేశాడు. టైటిల్ రాకపోయినా కోట్ల మంది ప్రజల అభిమానం దక్కడం తనకు కొండంత బలమని, బిగ్ బాస్ నేర్పిన పాఠాలు తన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని అతను చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో తనుజా రన్నరప్‌గా నిలవగా, పవన్ మూడవ స్థానాన్ని, సంజన ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు. కప్పు గెలవకపోయినా, ఒక కమెడియన్ టాప్ ప్లేయర్ కాగలడని నిరూపించిన ఇమ్మాన్యూయెల్ రియల్ విన్నర్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *