Daggubati Purandeswari: విజయవాడ…. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి తో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కలసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో వేగవంతం చేయడానికి సంబంధించిన విషయాన్ని మందకృష్ణ మాదిగ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ ఈ విషయం లో స్పష్టమైన వైఖరి తో ఉన్న విషయం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం