Shruti Haasan: ప్రముఖ నటి శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌పై గౌరవం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఎన్నో రూమర్స్ మధ్య కూడా నాన్న ఎప్పుడూ సపోర్ట్ చేశారని ఆమె చెప్పారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా ఇబ్బందులు పడలేదని తెలిపారు.
Also Read: Dragon: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఎన్టీఆర్ తల్లిగా?
కమల్ హాసన్ కుమార్తెగా సినీరంగానికి పరిచయమైన శ్రుతి హాసన్ సొంత గుర్తింపు సాధించుకున్నారు. గతంలో ఆమెకు కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. ఆ కథలు ఇతరులకు సిల్లీగా అనిపించవచ్చని, కానీ తనకు అలా కాదని ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. తండ్రి కమల్ హాసన్ ఎలాంటి అడ్డు చెప్పకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని శ్రుతి తెలిపారు. దాని వల్ల ఎప్పుడూ ఇబ్బంది పడలేదని అన్నారు. తనపై ఎన్నో రూమర్స్ వచ్చాయని, వాటిలో అబద్ధాలు ఉండవచ్చు, నిజాలు ఉండవచ్చని చెప్పారు. అయినా నాన్న ఎప్పుడూ తనకు సపోర్ట్‌గా నిలిచారని ఎమోషనల్‌గా పేర్కొన్నారు. కమల్ హాసన్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని, అందుకే తనకు ఎప్పటికీ అభిమానమేనని శ్రుతి చెప్పుకొచ్చారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా సొంతంగా ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా తెలిపారు.
