Sangareddy: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. కంగ్టి మండలం తురకవాడగామ గ్రామంలోని సమర్థ కోటెక్స్ పత్తి మిల్లులో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మిల్లులో నిల్వ ఉంచిన పత్తి బేళ్లకు మంటలు అంటుకున్నాయి. మూడు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ మంటల ధాటికి ఆ మిల్లులో ఉన్న యంత్రాలు కాలిపోగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది.
